Friday, September 4, 2026

Buy now

కాంగ్రెస్‌ 1000 రోజుల పాలనపై బీఆర్‌ఎస్‌ సమరభేరి:మాజీ ఎమ్మెల్యే కోరుకంటి

* మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ డిమాండ్‌

రామగుండం: కాంగ్రెస్‌ ప్రభుత్వం 1000 రోజుల పాలనలో మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ బీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో మూడో రోజు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆదేశాల మేరకు రామగుండం నియోజకవర్గ ఇన్‌చార్జ్‌, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ ఆధ్వర్యంలో మార్కండేయ కాలనీలోని లక్ష్మీ ఫంక్షన్‌ హాల్‌లో మహిళా సదస్సు నిర్వహించారు.

అనంతరం లక్ష్మీ ఫంక్షన్‌ హాల్‌ నుంచి ప్రధాన చౌరస్తా వరకు మహిళలతో మహా పాదయాత్ర చేపట్టారు. ప్రధాన చౌరస్తాలో మహిళలతో బతుకమ్మ నిర్వహించి, అనంతరం వంటావార్పు కార్యక్రమం చేపట్టి కాంగ్రెస్‌ ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన హామీల అమలుపై నిరసన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌ నాయకులు మాట్లాడుతూ.. మహిళలకు నెలకు రూ.2,500 ఇస్తామన్న హామీని అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాల కింద పేదింటి ఆడబిడ్డలకు తులం బంగారం ఇస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. వృద్ధులు, వితంతువులకు రూ.4,000 పెన్షన్‌, విద్యార్థినులకు స్కూటీలు ఇస్తామన్న హామీలను కూడా అమలు చేయాలని కోరారు.

హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం వాటిని అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తోందని బీఆర్‌ఎస్‌ నాయకులు ఆరోపించారు. మహిళల హక్కులు, సంక్షేమానికి సంబంధించిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.హామీల అమలు జరిగే వరకు బీఆర్‌ఎస్‌ పోరాటం కొనసాగుతుందని నాయకులు స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర నాయకురాలు మూల విజయరెడ్డి, బీఆర్‌ఎస్‌ నాయకులు కౌశిక హరి, వ్యాల హరీష్‌రెడ్డి, నడిపెల్లి మురళీధర్‌రావు,అంతర్గాం మాజీ జడ్పీటీసీ ఆముల నారాయణ, బీఆర్‌ఎస్‌ మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ మేకల సమయ యాదవ్‌, మహిళా కార్పొరేటర్లు, మహిళా నాయకురాళ్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

spot_img

Most Popular