Friday, September 4, 2026

Buy now

ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం!

* కొండపర్తిలో సీసీ రోడ్డు పనులకు శ్రీకారం చుట్టిన మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నకర కంటి మోహన్ గౌడ్

ఐనవోలు:ప్రజా సంక్షేమం, గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని ఐనవోలు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నకర కంటి మోహన్ గౌడ్ అన్నారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి కె.ఆర్. నాగరాజు ఆదేశాల మేరకు కొండపర్తి గ్రామంలోని కుమ్మరివాడ నుంచి బస్టాండ్ వాటర్ ప్లాంట్ వరకు సుమారు 1.2 కిలోమీటర్ల మేర నిర్మించనున్న సీసీ రోడ్డు పనులను శుక్రవారం ఆయన కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు.

ఈ సందర్భంగా మోహన్ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం 1000 రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ పేదల పక్షాన నిలబడుతుందని, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు.

ఇందిరమ్మ ఇళ్లు, రైతు రుణమాఫీ, సన్నబియ్యం, గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ వంటి పథకాలతో ప్రజలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు. విద్య, వైద్య రంగాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ పాఠశాలల నిర్మాణం చేపట్టి పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్య అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.

ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన ప్రజలకు రూ.10 లక్షల వరకు వైద్య సహాయం అందిస్తున్నామని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా సీసీ రోడ్డు పనులను చేపట్టినట్లు తెలిపారు. పనులను నాణ్యతా ప్రమాణాలతో వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత వారికి సూచించారు.

రానున్న రోజుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో వర్ధన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజు నియోజకవర్గంలోని ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్తారని మోహన్ గౌడ్ అన్నారు.

పెద్ద ఎత్తున పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు:
ఈ కార్యక్రమంలో ఐనవోలు మండల కాంగ్రెస్ పార్టీ సర్పంచుల ఫోరం అధ్యక్షుడు పోలపల్లి శివశంకర్ రెడ్డి, విలేజ్ ప్రెసిడెంట్ గద్దల సుమన్, కాంటెస్ట్ సర్పంచ్ వరంగంటి సత్తిరెడ్డి, ఉప సర్పంచ్ పిట్టల సుధీర్, మండల సోషల్ మీడియా కోఆర్డినేటర్ కట్కూరి సునీల్, మహిళా నాయకురాలు కట్కూరి నీరజ, బీఎల్ఏ రమేష్‌తో పాటు కాంగ్రెస్ పార్టీ జిల్లా, మండల సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు, వార్డు సభ్యులు, అనుబంధ సంఘాల నాయకులు, యూత్ నాయకులు, స్థానిక గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

spot_img

Most Popular