* జిల్లా రెవెన్యూ అధికారి రాజేశ్వరి
* ప్రజావాణి లో ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించిన డిఆర్ఓ
పెద్దపల్లి, : అర్జీల పరిష్కారం సత్వరమే చేయాలని, ప్రజావాణి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి అర్జీలను పెండింగ్ లో ఉంచకుండా పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అధికారి రాజేశ్వరి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా రెవెన్యూ అధికారి రాజేశ్వరి కలెక్టరేట్ సమావేశం మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించారు.
పెద్దపల్లి జిల్లాకు చెందిన షమిమ్ సుల్తాన తనకు ఇంటి స్థలం కరీంనగర్ లో ఉన్నందున ఇందిరమ్మ ఇల్లు కరీంనగర్లో మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా పిడి హోసింగ్ కు రాస్తూ పరిశీలించాలని డిఆర్ఓ తెలిపారు. రామగుండం జై భీమ్ నగర్ కు చెందిన గూపాల స్వామి తాను పక్షవాతంతో బాధపడుతున్నానని తనకు ఏదైనా ఉద్యోగం ఇప్పించాలని ఎంబీఏ చదువు పూర్తి చేశానని కోరుతూ దరఖాస్తు చేసుకోగా వారధి అధికారికి రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు.
ధర్మారం మండలం మేడారం గ్రామానికి చెందిన సాన కొమురయ్య అంగన్వాడి టీచర్ గా పని చేస్తున్న కుటుంబం నుంచి అక్రమంగా దివ్యాంగుల పెన్షన్, వితంతు పెన్షన్ పొందుతున్న వారిపై చట్ట ప్రకారమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా జిల్లా సంక్షేమ అధికారికి రాస్తూ పరిశీలించి చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టరేట్ డి.విభాగ పర్యవేక్షకులు ఈశ్వర ప్రసాద్, సంబంధిత జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

