Friday, August 7, 2026

Buy now

ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది:ఆది శ్రీనివాస్.

హైదరాబాద్: సనాతన ధర్మ పరిరక్షణ, ఆలయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొంటూ, ఆషాఢ మాసం బోనాల పండుగ సందర్భంగా ఉప్పల్ నియోజకవర్గంలోని 190 దేవాలయాలకు రూ.56 లక్షలకు పైగా ఆర్థిక సహాయ చెక్కులను పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్, నియోజకవర్గ ఇన్‌చార్జ్ పరమేశ్వర్ రెడ్డి తో కలిసి అర్చకులు, ఆలయ కమిటీ ప్రతినిధులకు చెక్కులు అందజేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం ఆధ్యాత్మిక విలువల పరిరక్షణతో పాటు ఆలయాల ప్రాభవాన్ని పునరుద్ధరించేందుకు అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు.

హైదరాబాద్‌ను విశ్వనగరంగా అభివృద్ధి చేసే క్రమంలో సంస్కృతి, సాంస్కృతిక వారసత్వ పరిరక్షణకు కూడా సమాన ప్రాధాన్యత కల్పిస్తున్నామని పేర్కొన్నారు. అలాగే భద్రాచలం, బాసర, వేములవాడ వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాల సమగ్ర అభివృద్ధికి వేల కోట్ల రూపాయలతో పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయని వెల్లడించారు.

గ్రామీణ ప్రాంతాల ఆలయాల్లో నిత్య ధూప, దీప, నైవేద్య కార్యక్రమాలు నిరంతరం కొనసాగేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నామని, అర్చకులకు ప్రతి నెలా మొదటి తేదీన వేతనాలు అందజేస్తున్నామని తెలిపారు.అమ్మవారి దివ్య ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని, సమృద్ధిగా వర్షాలు కురిసి తెలంగాణ శాంతి, సౌభాగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.

Related Articles

spot_img

Most Popular