హైదరాబాద్: ఆషాఢ మాస బోనాల ఉత్సవాల్లో భాగంగా రేపు (ఆగస్టు 9) హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లోని పలు ప్రముఖ అమ్మవారి ఆలయాల్లో రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ప్రభుత్వ ప్రతినిధులుగా మంత్రులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ సలహాదారులు, విప్‌లు తదితరులు ఆయా ఆలయాల్లో అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.
ప్రముఖ ఆలయాలు – పట్టు వస్త్రాలు సమర్పించే ప్రభుత్వ ప్రతినిధులు:
ఉప్పుగూడ శ్రీ మహంకాళి ఆలయం – గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనమండలి చైర్మన్
మీరాలం మండి శ్రీ మహంకాళి ఆలయం – గడ్డం ప్రసాద్ కుమార్, శాసనసభ స్పీకర్
లాల్‌దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి ఆలయం – మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ
కార్వాన్ శ్రీ దర్బార్ మైసమ్మ ఆలయం – దామోదర రాజనర్సింహ, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి
సుల్తాన్‌షాహి శ్రీ బంగారు మైసమ్మ ఆలయం – కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి
హరిబౌలిలోని శ్రీ అక్కన్న మాదన్న ఆలయం – దుద్దిళ్ల శ్రీధర్ బాబు, మంత్రి
చిలకలగూడ శ్రీ కట్ట మైసమ్మ ఆలయం – పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మంత్రి
అంబర్‌పేట శ్రీ మహంకాళి ఆలయం – దనసరి అనసూయ సీతక్క, మంత్రి
సబ్జీ మండి శ్రీ నల్ల పోచమ్మ ఆలయం – తుమ్మల నాగేశ్వరరావు, మంత్రి
రాంబక్షబండ శ్రీ బంగారు మైసమ్మ ఆలయం – జూపల్లి కృష్ణారావు, మంత్రి
భేలా శ్రీ ముత్యాలమ్మ ఆలయం – గడ్డం వివేక్ వెంకటస్వామి, మంత్రి
సుల్తాన్‌షాహి శ్రీ జగదాంబ ఆలయం – అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మంత్రి
గౌలిపూర శ్రీ మహంకాళి ఆలయం – వాకిటి శ్రీహరి, మంత్రి
హరిబౌలి శ్రీ నల్ల పోచమ్మ ఆలయం – వేం నరేందర్ రెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారు
హరిబౌలి శ్రీ బంగారు మైసమ్మ ఆలయం –హనుమంతరావు, ప్రభుత్వ సలహాదారు
బోయిగూడ శ్రీ బంగారు మైసమ్మ ఆలయం – కేశవరావు, శ్రీ అద్దంకి దయాకర్, ప్రభుత్వ ప్రతినిధులు
నాచారం శ్రీ మహంకాళి సమేత మహంకాళేశ్వర ఆలయం – సుదర్శన్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు
గౌలిగూడ శ్రీ మహంకాళి ఆలయం – హర్కర వేణుగోపాల్ రావు, ప్రభుత్వ సలహాదారు
ఎల్‌బీనగర్ శ్రీ ఖిల్లా మైసమ్మ ఆలయం – పొచారం శ్రీనివాస్ రెడ్డి, శ్రీ ఆది శ్రీనివాస్, ప్రభుత్వ విప్‌లు
అలీజాకోట శ్రీ మహంకాళి ఆలయం – విజయ రమణారావు, ప్రభుత్వ సలహాదారు/ఎమ్మెల్యే
మూసీ బ్రిడ్జి శ్రీ భూలక్ష్మి ఆలయం – పట్నం మహేందర్ రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్
నట్రాజ్ నగర్ శ్రీ మహంకాళి ఆలయం – బాల్మూరి వెంకట్, ప్రభుత్వ విప్
అలియాబాద్ శ్రీ దర్బార్ మైసమ్మ ఆలయం – జాతోత్ రామ్‌చందర్ నాయక్, ఉప సభాపతి
మురాద్ మహల్ శ్రీ నల్ల పోచమ్మ ఆలయం – బండా ప్రకాశ్, శాసనమండలి డిప్యూటీ చైర్మన్
సీబీఐ క్వార్టర్స్ శ్రీ నల్ల పోచమ్మ ఆలయం – ఎం. అనిల్ కుమార్ యాదవ్, రాజ్యసభ సభ్యుడు
చార్మినార్ శ్రీ భాగ్యలక్ష్మి ఆలయం – మహేష్ కుమార్ గౌడ్, శాసనమండలి సభ్యుడు
ఆషాఢ మాస బోనాల ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేపట్టింది. అమ్మవార్లకు ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించడం ద్వారా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను గౌరవిస్తూ, భక్తుల విశ్వాసాలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. ఉత్సవాలు ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో జరిగేలా అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు.

