* ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు
ప్రజానావ,బ్యూరో,పెద్దపల్లి : మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ నూగిల్ల మల్లయ్య అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు హాజరైనరు మొదటగా దేశ రక్షణ వ్యవస్థకు అణుశక్తిని జోడించిన మిస్సైల్ మ్యాన్, జీవితాంతం భారతమాత సేవకే అంకితమైన మహోన్నత వ్యక్తి , మాజీ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాల వేసి వారికి ఘన నివాళులు అర్పించారు. అనంతరం సమావేశంలోని ఎజెండా అంశములు 39 గాను, కౌన్సిలర్లు 39 అంశాలను ఏకగ్రీవంగా తీర్మానం చేశారు.
అనంతరం కౌన్సిలర్లు, వార్డ్ ఆఫీసర్లు, (బిఎల్ఓ) మెప్మా ఆర్పీలతో ఎస్ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పై గౌరవ ఎమ్మెల్యే సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలోని 36 వార్డులో ఎస్ఐఆర్ ప్రోగ్రాం పైన ప్రతిఒక్క కౌన్సిలర్ వార్డ్ ఆఫీసర్లు, బిఎల్ఓ ల సహకారంతో ఎలాంటి పొరపాట్లు లేకుండా ప్రత్యేక దృష్టి సారించాలని అవసరమైతే వార్డులో ప్రత్యేక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయించాలని మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్ కి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్, వైస్ చైర్ పర్సన్ ముస్కాన్ నాజ్ నయ్యర్ అలీ, కౌన్సిలర్లు, టౌన్ ప్లానింగ్ అధికారులు నరేష్, వినయ్, జూనియర్ అసిస్టెంట్లు రమాకాంత్, సురేందర్, వార్డ్ ఆఫీసర్లు, మెప్మా ఆర్పీలు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

