Friday, August 14, 2026

Buy now

ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ల సంఘం అధ్యక్షుడిగా కృష్ణారెడ్డి

పెద్దపల్లి : సర్కిల్ ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సీనియర్ కాంట్రాక్టర్ ఏ. కృష్ణారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షుడిగా చెప్పాల సమ్మయ్య, ప్రధాన కార్యదర్శిగా ఎం. సుధాకర్, కోశాధికారిగా ఎన్. రాజిరెడ్డి, జాయింట్ సెక్రటరీగా వి. శ్రీనివాస్ గౌడ్ ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా రాధయ్య, పిల్లి రాజు, ఎస్. గురువయ్య, గుమ్మడి అంజయ్య, డి. స్రవంతి, ఎం. శంకర్ తదితరులు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు కృష్ణారెడ్డి మాట్లాడుతూ కాంట్రాక్టర్ల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సంఘం అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం నూతన కార్యవర్గ సభ్యులను పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు.

Related Articles

spot_img

Most Popular