Monday, October 5, 2026

Buy now

ఎల్‌నినోతో ఆయిల్‌పామ్‌ మేలు:కలెక్టర్

◆ ​సాగు వైపు దృష్టి సారించాలి
◆ ​వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి

ప్రజానావ ఉమ్మడి మహబూబ్ నగర్ బ్యూరో : ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో రైతులు వరికి బదులుగా ఆయిల్‌పామ్ వంటి అధిక లాభసాటి ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు.

శుక్రవారం గోపాల్‌పేట మండలం తాడిపర్తి గ్రామంలో రైతు భాను పొలంలో ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆయిల్‌పామ్ మొక్కల నాటే కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని, మొక్క నాటారు. ​ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఆయిల్‌పామ్ రైతులకు దీర్ఘకాలికంగా స్థిరమైన ఆదాయాన్ని అందిస్తుందని, ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

వ్యవసాయ, ఉద్యాన అధికారులు గ్రామాల వారీగా రైతులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. పొలాలకు రహదారి సౌకర్యం కల్పించాలని రైతులు కోరగా.. ఉపాధి హామీ బీవీజీ రామ్‌జీ పథకం కింద ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఎంపీడీవోను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీవైఎస్వో సుధీర్ రెడ్డి, డీహెచ్‌ఎస్‌వో విజయ్ భాస్కర్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Related Articles

spot_img

Most Popular