* ఏఎస్ఐగా సన్మానిస్తున్న మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ డి.జానకి
ఉమ్మడి మహబూబ్‌నగర్ బ్యూరో: స్పెషల్ బ్రాంచ్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న జి.యాదగిరి ఏఎస్ఐగా పదోన్నతి పొందారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకిని ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. ఎస్పీ ఆయనకు పదోన్నతి సూచికను బహుకరించి, అభినందనలు తెలిపారు. 1990 బ్యాచ్‌కు చెందిన యాదగిరి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లలో సుదీర్ఘకాలం సేవలందించారు. ప్రస్తుతం ఆయన ఏఎస్ఐగా పదోన్నతిపై జోగులాంబ గద్వాల జిల్లాకు బదిలీ అయ్యారు. విధుల్లో ఇదే నిబద్ధతను కొనసాగించాలని ఈ సందర్భంగా ఎస్పీ ఆకాంక్షించారు.

