Sunday, July 26, 2026

Buy now

ఏకలవ్య జయంతిని అధికారికంగా నిర్వహించాలి

* తెలంగాణ ఎరుకల ప్రజా సమితి డిమాండ్

ప్రజానావ,బ్యూరో,పెద్దపల్లి : తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ ఎరుకల ప్రజా సమితి ఆధ్వర్యంలో ఎరుకల కులదైవమైన ఏకలవ్యుని జయంతిని ఘనంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం ఏకలవ్య జయంతిని జరుపుకుంటున్నామని, దీనిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా గుర్తించి ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించాలని తెలంగాణ ఎరుకల ప్రజా సమితి నాయకులు డిమాండ్ చేశారు. అదేవిధంగా, ఎరుకల సామాజిక వర్గం అభివృద్ధి కోసం ప్రత్యేక ఎరుకల కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా తెలంగాణ ఎరుకల ప్రజా సమితి జిల్లా అధ్యక్షుడు మానుపాటి రవి మాట్లాడుతూ, ఎరుకల సమాజ సంక్షేమం, విద్య, ఉపాధి, ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు మానుపాటి సీను, రెవెళ్లి తిరుపతి, జిల్లా ఉపాధ్యక్షులు అల్లెపు సదాశివ, రెవెళ్లి శీనయ్య, లోకిని సమ్మయ్య, ముఖ్య కార్యకర్తలు సీను, సంపత్, శ్రీకాంత్, కళ్యాణ్, ప్రభాకర్, శివాజీ, శ్రీనాథ్, అంజి, సాయివర్ధన్ కుమార్తో పాటు ఎరుకల కులస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Related Articles

spot_img

Most Popular