Thursday, July 16, 2026

Buy now

ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో మాజీ డీసీసీ అధ్యక్షురాలు

మంచిర్యాల: మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 14,42,43,44,46 డివిజన్లలో నిర్వహిస్తున్న SIR (Special Intensive Revision) ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో పాల్గొన్న మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు.

డివిజన్ లో పలు బూత్ లో లో సాధారణ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఓటరు జాబితాలను పరిశీలించారు, అర్హులైన ప్రతి ఒక్కరి పేరు జాబితాలో నమోదు కావడం, మరణించినవారి పేర్లు లేదా ఇతర ప్రాంతాలకు మారిన వారి వివరాలను సరిచేయడం వంటి అంశాలపై అధికారులకు సూచనలు చేశారు.

ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఉపాధ్యక్షులు చిట్లా సత్యనారాయణ , మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తూముల నరేష్ , BLO లు, స్థానిక కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..

Related Articles

spot_img

Most Popular