Thursday, July 16, 2026

Buy now

కస్తూర్భా గాంధీ బాలికల వసతి పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన:శాసనసభ్యులు కవ్వంపల్లి సత్యనారాయణ

మానకొండూర్: నియోజకవర్గ శాసనసభ్యులు మరియు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఎస్సీ సెల్ చైర్మన్ కవ్వంపల్లి సత్యనారాయణ నియోజకవర్గంలోని ఇల్లంతకుంట మండల కేంద్రంలో ఉన్న కస్తూర్భా గాంధీ బాలికల వసతి పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.

పాఠశాలకు చేరుకున్న వెంటనే తరగతి గదులు, హాస్టల్ భవనాలు, వంటశాల, తాగునీటి సౌకర్యాలు, శుభ్రత, భద్రత వంటి అన్ని అంశాలను వివరంగా పరిశీలించారు. విద్యార్థినులతో సాన్నిహిత్యంగా మాట్లాడుతూ, వారు ఎదుర్కొంటున్న సమస్యలు ఏమిటి? చదువులో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి? ఆహారం, వసతి, ఆరోగ్య సౌకర్యాలు సరిగ్గా ఉన్నాయా? అని వివరంగా అడిగి తెలుసుకున్నారు.

విద్యార్థినులు తమ సమస్యలను నేరుగా చెప్పేలా వాతావరణం సృష్టించి, వారి అభిప్రాయాలను శ్రద్ధగా విన్నారు. తర్వాత విద్యార్థినులతో కలిసి భోజనం చేసి, వారి ఆనందాన్ని పంచుకున్నారు.ఈ ఆకస్మిక తనిఖీ ద్వారా పాఠశాల నిర్వహణలో ఉన్న లోపాలను గుర్తించి, వాటిని త్వరగా సరిదిద్దేందుకు అధికారులకు సూచనలు చేశారు.

Related Articles

spot_img

Most Popular