Tuesday, August 25, 2026

Buy now

కాంగ్రెస్ సర్కారులో రైతాంగానికి పెద్దపీట

* వ్యవసాయ మార్కెట్లో రైతులకు అన్ని రకాల మౌళిక సదుపాయాలు
* రూ.1.39 కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం
* రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు

పెద్దపల్లి : జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో రూ.1.39 కోట్ల నిధులతో డ్రైన్ ప్లాట్ ఫాం, మరుగుదొడ్ల బ్లాక్ నిర్మాణాలకు మార్కెట్ చైర్మన్, స్థానిక నాయకులతో కలిసి రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ విజయరమణ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతాంగానికి పెద్దపీట వేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతుల పట్ల చిత్తశుద్ధితో పని చేస్తున్నారని ఆయన అన్నారు.

పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్లో రూ. 1.39 కోట్లతో డ్రైన్ ప్లాట్ ఫామ్, నూతన టాయిలెట్స్ నిర్మాణాలకు శంకుస్థాపనలు చేసుకోవడం జరిగిందని వ్యవసాయ మార్కెట్లో రైతులకు అన్ని రకాల మౌళిక సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వంలో రైతులు అన్ని విధాలుగా మోసపోయారని కానీ ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు గింజ కటింగ్ లేకుండా సజావుగా కొనుగోళ్లు జరుగుతున్నాయని అన్నారు.

కాంగ్రెస్ సర్కారు హయంలో రైతులకు కాళేశ్వరం ప్రాజెక్టుతో సంబంధం లేకుండా చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించామని గత పాలకుల హయంలో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారానే సాగునీరు అందుతుందని కల్లబొల్లి మాటలు చెప్పి పబ్బం గడిపారని చివరికి తీరా కాళేశ్వరం కాస్తా కూళేశ్వరం అయిందని విమర్శించారు.

ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, వ్యవసాయ మార్కెట్ చైర్మన్, డైరెక్టర్లు, సింగిల్ విండో చైర్మన్లు, పట్టణ కౌన్సిలర్లు, పలు గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు, రైతులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

spot_img

Most Popular