– నిరాడంబర కమ్యూనిస్టు నాయకుడు సారంపల్లి మల్లారెడ్డి
– ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రైతాంగా ఉద్యమంతో ఎనలేని బంధం
ప్రజానావ/మంచిర్యాల: సిపిఎం పార్టీ సీనియర్ నేత, రైతు ఉద్యమ నాయకుడు, అఖిల భారత కిసాన్ సభ జాతీయ ఉపాధ్యక్షులు, కామ్రేడ్ సారంపల్లి మల్లారెడ్డి మరణం రైతు ఉద్యమాలకు తీరని లోటు చెన్నూరు మండల కేంద్రంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మల్లారెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా బోడంకి చందు సిపిఎం జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ.. హైదరాబాదు నిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఈ నెల 24 తేదీన ఉదయం 3 గంటలకు తుది శ్వాస వదిలారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతు సంఘం స్థాపనలో కీలక పాత్ర పోషించారని వ్యవసాయ రంగ నిపుణుడిగా నీటిపారుదల రంగంలో నిష్ణాతుడిగా అపార అనుభవం కలిగిన నాయకుడని అనేకమంది రాజకీయ నాయకులు, అధికారులు కూడా మల్లారెడ్డి దగ్గర సలహాలు తీసుకునే వారిని అలాంటి వ్యక్తి మరణించడం బాధాకరమని మల్లారెడ్డి మృతికి సిపిఎం మంచిర్యాల జిల్లా కమిటీ తరఫున సంతాపం తెలుపుతూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
రైతాంగా సమస్యలు, భూ సమస్యలపై అనేక ఉద్యమాలు నిర్మించారు. సీడ్ పత్తి సాగులో నష్టపోతున్న రైతులకు అండగా వ్యవసాయ శాస్త్రవేత్తలను తీసుకువచ్చి పంట పొలాలు సందర్శించి రైతులకు మద్దతుగా రాష్ట్రస్థాయిలో అధికారులతో, మంత్రులతో అనేక పర్యాయాలు చర్చలు జరిపి సమస్యల పరిష్కారానికి ఈ ప్రాంత రైతులకు అండగా నిలబడ్డారని తెలిపారు.
వరంగల్ జిల్లాలో పుట్టిన మల్లారెడ్డి గారు రాష్ట్రం లో సిపిఎం పార్టీ నిర్మాణంలో రైతు సంగం నిర్మాణంలో కీలక పాత్ర పోషించారని, సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులుగా, కంట్రోల్ కమిషన్ చైర్మన్ గా, బాధ్యతలు నిర్వర్తించాలని తెలిపారు. కమ్యూనిస్టు నిరాడంబరమైన జీవితం గడిపారని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు సిడం సమ్మక్క, మధు నక్క, మహేశ్వరి, రేణుక, సత్తక్క తదితరులు పాల్గొన్నారు.

