పెద్దపల్లి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా పెద్దపల్లి మండలం సబ్బితం గ్రామంలో స్థానిక నాయకులతో కలిసి రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు మొక్కలను నాటారు.
ఈ వన మహోత్సవ కార్యక్రమంలో మొక్కలను నాటే విషయంలో అలాగే మొక్కల పంపిణీ విషయంలో పలు సూచనలు సలహాలు అందించి పూర్తి స్థాయిలో మొక్కల సంరక్షణ చేసి వాటిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ప్రభుత్వ విప్ విజయరమణ రావు ఆదేశించారు.
అలాగే మొక్కల పెంపకం, వాటి సంరక్షణను ఎప్పటికప్పుడు రికార్డు చేసుకోవాలని సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్, అటవీ శాఖ అధికారులు, ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.

