Friday, August 14, 2026

Buy now

కుచారంలో సీసీ కెమెరాల నిఘా.. భద్రత మరింత పటిష్ఠం

మెదక్: మెదక్ జిల్లా కుచారం గ్రామంలోని బంగారమ్మ ఆలయ పరిసరాల్లో 18 సీసీ కెమెరాలు, 2 ఏఎన్‌పీఆర్ (ANPR) కెమెరాలను జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు, ఐపీఎస్ ప్రారంభించారు. ఐటీసీ కంపెనీ సహకారంతో ఏర్పాటు చేసిన ఈ ఆధునిక భద్రతా వ్యవస్థతో ప్రజల రక్షణ మరింత బలోపేతం కానుందని ఆయన తెలిపారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. సీసీ కెమెరాలు నేరాల నియంత్రణ, నిందితుల గుర్తింపు, వాహనాల కదలికలపై నిరంతర నిఘా నిర్వహించడంలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. ఆధునిక సాంకేతికతను వినియోగించి ప్రజలకు మరింత భద్రత కల్పించేందుకు పోలీసు శాఖ కట్టుబడి ఉందన్నారు.

అలాగే డ్రగ్స్‌, సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎలాంటి అనుమానాస్పద ఘటనలు కనిపించినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.”సీసీ కెమెరాల నిఘా.. నేరాల నియంత్రణకు బలమైన ఆయుధం” అని ఎస్పీ పేర్కొన్నారు.

Related Articles

spot_img

Most Popular