Friday, August 14, 2026

Buy now

కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక రైతు, ప్రజా వ్యతిరేక విధానాలు ఎండగడుతూ రాస్తారోకో

– క్విట్ ఇండియా ఉద్యమస్ఫూర్తి తో జైలు బరో జయప్రదం
– నాలుగు లేబర్ కోళ్లు రద్దు చేయాలి
– స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలు రద్దు చేయాలి*

ప్రజానావ / మంచిర్యాల: చెన్నూరు మండల కేంద్రంలో సిఐటియు, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జైల్ బరో కార్యక్రమం నిర్వహణలో భాగంగా రావి చెట్టు నుంచి బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది. అనంతరం బస్టాండ్ దగ్గర రాస్తారోకో చేయడం జరిగింది. ఈ సందర్భంగా బోడంకి చందు రైతు సంఘం జిల్లా కార్యదర్శి హాజరై మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న ప్రజా, కార్మిక,రైతు వ్యతిరేక విధానాలు నశించాలని, స్వాతంత్ర ఉద్యమం కన్నా ముందు సాధించుకున్నా కార్మిక చట్టాలను రద్దుచేసి, నాలుగు లేబర్ కోడ్ తీసుకువచ్చి కార్మికులకు కనీస హక్కులు లేకుండా చేస్తున్నారు. ప్రభుత్వ సంస్థలన్నీ ప్రైవేటుపరం చేస్తున్నారు, రైతుల విత్తన చట్టం, విద్యుత్ సవరణ చట్టాo రద్దు చేయాలని , మహాత్మ గ్రామీణ ఉపాధి హామీ చట్టం కొనసాగించాలి, పంటలకు మద్దతు ధర కల్పించాలి, స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలు రద్దు చేయాలి, వ్యవసాయాన్ని రంగాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టే పని మానుకోవాలి. మధ్యాహ్నం భోజనం,ఆశ కార్మికులకు కనీస వేతనం జీవో అమలు చేయాలి. కార్మికులకు పెండింగ్ బిల్లులు వేతనాలు చెల్లించాలి. ఉపాధి హామీ కూలీలకు 200 రోజులు పని కల్పించి, రోజుకు 600 రూపాయలు ఇవ్వాలని, ఆదివాసులకు అటవీ హక్కు చట్టం పటిష్టంగా అమలు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎర్మ పున్నం ఆదివాసి గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి, కావేరి రవి సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు, శ్యామల ఉమారాణి మహిళా సంఘం జిల్లా కార్యదర్శి, కృష్ణమాచారి, వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షులు, సరోజ, ఆశ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు, కరింభీ మధ్యాహ్నం భోజన కార్మిక సంఘం జిల్లా అధ్యక్షురాలు, ఎర్రోళ్ల సంజీవ్ డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు, ప్రజాసంఘాల నాయకులు చంద్రన్న, సమ్మక్క, మల్లికార్జున్, మదనక్క, గట్టక్క, దుర్గక్క, విజయలక్ష్మి, సెగ్గం భూషయ్య, రమేష్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

Related Articles

spot_img

Most Popular