Thursday, July 16, 2026

Buy now

కోడేర్ పీఎస్ లో ఎస్పీ వార్షిక తనిఖీ

ఉమ్మడి మహబూబ్ నగర్ బ్యూరో: స్థానిక పోలీస్ స్టేషన్‌ను నాగర్‌కర్నూల్ జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్‌సింగ్ జి. పాటిల్ వార్షిక తనిఖీల్లో భాగంగా శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా స్టేషన్ పరిసరాలు, రికార్డులను తనిఖీ చేసి, సిబ్బంది క్రమశిక్షణపై సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. స్టేషన్‌కు వచ్చే బాధితుల ఫిర్యాదులపై తక్షణమే స్పందించి పారదర్శక విచారణతో న్యాయం చేయాలని ఆదేశించారు.

డయల్ 100/112 కాల్స్‌కు బ్లూకోల్ట్స్ సిబ్బంది వేగంగా స్పందించాలన్నారు. రౌడీషీటర్ల కదలికలపై నిఘా ఉంచాలని, విలేజ్ పోలీస్ అధికారులు గ్రామాల్లో అందుబాటులో ఉండాలని సూచించారు. పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని ఎస్సై వేణుగోపాల్‌ను ఆదేశించారు. అనంతరం పీఎస్ ఆవరణలో ఎస్పీ మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో నాగర్‌కర్నూల్ డీఎస్పీ బి.శ్రీనివాసులు, కొల్లాపూర్ సీఐ శంకర్ నాయక్, డీసీఆర్‌బీ ఎస్సై రమేష్, సిబ్బంది పాల్గొన్నారు.

Related Articles

spot_img

Most Popular