ప్రజానావ,ఉమ్మడి మహబూబ్ నగర్ బ్యూరో: ప్రజలకు నాణ్యమైన, పారదర్శకమైన సేవలు అందించడమే పోలీసుల ప్రధాన లక్ష్యమని జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి, ఐపీఎస్ స్పష్టం చేశారు. శుక్రవారం కోయిలకొండ పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన ఆమె, స్టేషన్ రికార్డులు, పెండింగ్ కేసులు, శాంతిభద్రతల పరిస్థితిపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ… స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా వ్యవహరించాలని, మహిళలు, చిన్నారుల భద్రతకు ప్రాధాన్యమిస్తూ పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలని ఆదేశించారు. అలాగే నేరాల నియంత్రణ, కమ్యూనిటీ పోలీసింగ్‌ను మరింత బలోపేతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కోయిలకొండ ఎస్ఐ మరియు సిబ్బంది పాల్గొన్నారు.

