Thursday, July 16, 2026

Buy now

కోహెడలో రూ.47.03 కోట్లతో అంతర్జాతీయ స్థాయి ఎగుమతి హోల్‌సేల్ చేపల మార్కెట్‌కు శంకుస్థాపన

* మంత్రి వాకిటి శ్రీహరి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొనగా ఘనంగా కార్యక్రమం

కోహెడ(అబ్దుల్లాపూర్ మెట్),ప్రజానావ బ్యూరో:** జాతీయ మత్స్యకారుల దినోత్సవాన్ని పురస్కరించుకుని రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం కోహెడలో రూ.47.03 కోట్ల వ్యయంతో నిర్మించనున్న అంతర్జాతీయ స్థాయి ఎగుమతి హోల్‌సేల్ చేపల మార్కెట్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం శంకుస్థాపన చేసింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని భూమిపూజ నిర్వహించారు.

ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మత్స్యకారులకు చెక్కులను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం వెనుకబడిన వర్గాల సంక్షేమానికి, ముఖ్యంగా మత్స్యకారుల ఆర్థికాభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు. కోహెడలో ఏర్పాటు చేస్తున్న ఈ అత్యాధునిక హోల్‌సేల్ చేపల మార్కెట్ ద్వారా మత్స్యకారులు దళారీలపై ఆధారపడకుండా తమ ఉత్పత్తులను నేరుగా విక్రయించి అంతర్జాతీయ స్థాయిలో గిట్టుబాటు ధర పొందే అవకాశం కలుగుతుందని తెలిపారు.

జాతీయ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టడం రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమానికి ఇస్తున్న ప్రాధాన్యతకు నిదర్శనమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ ఉన్నతాధికారులు, జిల్లా అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మత్స్యకార సంఘాల ప్రతినిధులు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రభుత్వం చేపట్టిన ఈ నిర్ణయంపై మత్స్యకారులు హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి వాకిటి శ్రీహరికి కృతజ్ఞతలు తెలిపారు.

Related Articles

spot_img

Most Popular