Thursday, July 16, 2026

Buy now

క్షేత్రస్థాయి విద్యుత్ సిబ్బంది భద్రతపై ప్రత్యేక దృష్టి

హైదరాబాద్‌: 21 సర్కిళ్ల లైన్ సిబ్బందితో టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ జితేష్ వి. పాటిల్ ముఖాముఖి సమావేశం
విద్యుత్ ఉద్యోగుల భద్రత, సంక్షేమం మరియు ప్రమాద రహిత విద్యుత్ సేవల లక్ష్యంతో తెలంగాణ దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్) చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ జితేష్ వి. పాటిల్ ఆధ్వర్యంలో “2026 జూలై 9వ తేదీ బుధవారం హైదరాబాద్‌లోని సెంట్రల్ పవర్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ (సీపీటీఐ), యూసుఫ్‌గూడలో” ప్రత్యేక ముఖా మూఖి కార్యక్రమం నిర్వహించనున్నారు.

సంస్థ పరిధిలోని 21 సర్కిళ్ల నుంచి లైన్‌మ్యాన్‌లు, అసిస్టెంట్ లైన్‌మ్యాన్‌లు, జూనియర్ లైన్‌మ్యాన్‌లు ఒక్కోసర్కిల్ నుండి ఇద్దరు చొప్పున మొత్తం 40 మంది ఈ ముఖా మూఖిలో పాల్గొంటారు. క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించే సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలు, భద్రతాపరమైన సవాళ్లు, విధి నిర్వహణలో ఎదురయ్యే ఇబ్బందులు, విద్యుత్ ప్రమాదాలకు దారితీసే కారణాలు, వాటి నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై సీఎండీ నేరుగా వారితో చర్చించనున్నారు.

విద్యుత్ స్తంభాలు ఎక్కే సమయంలో పాటించాల్సిన భద్రతా ప్రమాణాలు, లైన్ క్లియరెన్స్ (ఎల్‌సీ) విధానాల అమలు, వ్యక్తిగత భద్రతా పరికరాల (PPE) వినియోగం, ప్రమాద నివారణ చర్యలు, అత్యవసర పరిస్థితుల్లో అనుసరించాల్సిన భద్రతా విధానాలు వంటి అంశాలపై సమగ్రంగా చర్చించనున్నారు. అలాగే క్షేత్రస్థాయిలో భద్రతా ప్రమాణాల అమలులో ఎదురవుతున్న సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారానికి అవసరమైన సూచనలు ఇవ్వనున్నారు.

ఈ సందర్భంగా ఉద్యోగుల నుంచి నేరుగా సూచనలు, అభిప్రాయాలు, అనుభవాలను స్వీకరించి, సంస్థలో భద్రతా సంస్కృతిని మరింత బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై మార్గదర్శకాలు జారీ చేయనున్నారు.
టీజీఎస్పీడీసీఎల్ యాజమాన్యం విద్యుత్ ఉద్యోగుల ప్రాణ భద్రతకు అత్యున్నత ప్రాధాన్యత ఇస్తోందని, “ప్రతి ఉద్యోగి సురక్షితంగా విధులు నిర్వహించి సురక్షితంగా ఇంటికి చేరుకోవాలి” అనే లక్ష్యంతో భద్రతా చర్యలను నిరంతరం బలోపేతం చేస్తోందని తెలిపింది.

ఉద్యోగులతో ప్రత్యక్షంగా మమేకమవుతూ వారి అనుభవాలను తెలుసుకోవడం ద్వారా ప్రమాదాల నివారణకు మరింత సమర్థవంతమైన కార్యాచరణ రూపొందించడంతో పాటు, భద్రతాయుతమైన మరియు నాణ్యమైన విద్యుత్ సేవలను వినియోగదారులకు అందించేందుకు ఈ సమావేశం దోహదపడుతుందని సంస్థ పేర్కొంది.

Related Articles

spot_img

Most Popular