Sunday, October 4, 2026

Buy now

గంజాయి వినియోగానికి అలవాటు పడిన ముగ్గురికి డీ-అడిక్షన్ సెంటర్‌కు తరలింపు

మంచిర్యాల: గంజాయి, ఇతర మత్తు పదార్థాల వినియోగానికి యువత దూరంగా ఉండాలని భీమారం ఎస్‌ఐ ఎ. రాజేందర్ సూచించారు.భీమారం పోలీస్‌స్టేషన్ పరిధిలో గంజాయి వినియోగానికి అలవాటు పడిన ముగ్గురు వ్యక్తులు ఎం.డి. హబీబ్ (భీమారం), కృష్ణ ప్రసాద్ (దాంపూర్), వినీత్ (దాంపూర్)పై భీమారం పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం వారిని చెన్నూర్ గౌరవ న్యాయస్థానంలో హాజరుపరిచారు.వారి ప్రవర్తనలో మార్పు తీసుకురావడంతో పాటు కౌన్సెలింగ్, చికిత్స, పునరావాసం కల్పించేందుకు మంచిర్యాలలోని ప్రభుత్వ డీ-అడిక్షన్ సెంటర్‌కు తరలించాలని గౌరవ మేజిస్ట్రేట్ ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ సందర్భంగా ఎస్‌ఐ ఎ. రాజేందర్ మాట్లాడుతూ.. గంజాయి, ఇతర మత్తు పదార్థాల వినియోగం యువత ఆరోగ్యంతో పాటు వారి భవిష్యత్తు, కుటుంబం, సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతుందని తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనలో వచ్చే మార్పులను గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని, యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండేలా అవగాహన కల్పించాలని సూచించారు.

మత్తు పదార్థాల అక్రమ వినియోగం లేదా విక్రయాలకు సంబంధించిన సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రజలను కోరారు. మత్తు పదార్థాల రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా భాగస్వాములు కావాలని ఎస్‌ఐ ఎ. రాజేందర్ పిలుపునిచ్చారు.

Related Articles

spot_img

Most Popular