Thursday, July 30, 2026

Buy now

గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను లష్కర్ బోనాల ఉత్సవాలకు ఆహ్వానించిన మంత్రి కొండా సురేఖ

హైదరాబాద్ : రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గురువారం లోక్ భవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా సికింద్రాబాద్‌లో జరగనున్న ఆషాఢ బోనాల (లష్కర్ బోనాలు) ఉత్సవాలకు విచ్చేసి అమ్మవారి ప్రత్యేక పూజల్లో పాల్గొనాలని మంత్రి కొండా సురేఖ గవర్నర్‌ను ఆహ్వానించారు. ఉజ్జయిని మహంకాళి దేవస్థాన ప్రధాన అర్చకులు ఆహ్వాన పత్రికను గవర్నర్‌కు అందజేసి, ఉత్సవాల ప్రాముఖ్యతను వివరించారు.

బోనాల ఉత్సవాలు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తాయని, ప్రతి ఏటా లక్షలాది మంది భక్తులు ఈ వేడుకల్లో పాల్గొంటారని మంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు.ఈ భేటీలో దేవాదాయ శాఖ డైరెక్టర్ హనుమంతరావు, ఉజ్జయిని మహంకాళి దేవస్థానం ఈవో, అసిస్టెంట్ కమిషనర్ మనోహర్ రెడ్డి తదితర అధికారులు మంత్రి వెంట పాల్గొన్నారు.

Related Articles

spot_img

Most Popular