– మౌలిక సదుపాయాలు కల్పించాలి.
– సిపిఎం పార్టీ నాయకులు డిమాండ్.
మంచిర్యాల జిల్లా / చెన్నూర్, జూలై 06. (ప్రజానవ ప్రతినిధి) :చెన్నూరు మండలం బావురావుపేట శివారు సర్వేనెంబర్ 8లో నివాసం ఉంటున్న పేద ప్రజలకు పట్టాలు ఇవ్వాలని ఎమ్మార్వో ఆఫీస్ ముందు ధర్నా చేసి డిటి కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
ఈ సందర్భంగా బోడంకి చందు సిపిఎం జిల్లా కార్యదర్శి హాజరై మాట్లాడుతూ.. బావురావుపేట శివారు సర్వేనెంబర్ 8లో పేద ప్రజలు నాలుగు సంవత్సరాలుగా రాత్రానిక, పగలనకా చీకట్లో కూడా కనీస సౌకర్యాలు లేకున్నా అక్కడే నిరుపేదలు ఇంటి స్థలం కోసం నివసిస్తున్నారని, వారికి కనీస సౌకర్యాలు లైన మంచినీల్లు, కరెంటు, రోడ్డు, ఇందిరమ్మ ఇల్లు, ఇంటి పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఉమారాణి సిపిఎం జిల్లా కమిటీ సభ్యురాలు, సిపిఎం నాయకులు, కృష్ణమాచారి, ఎర్మా పున్నం, గుడిసె వాసులు, సమ్మక్క, బండారి రాజేశ్వరి, తుమ్మ రేణుక, భోగే సత్యం, యామిని, రాసకట్ల పోచం, ఎల్లక్క, శ్యామల, బండారు శ్రీనివాస్, కామెర్ మధుకర్, సరిత, మధు నక్క, మహేశ్వరి, సత్యక్క, మల్లికార్జున్, ఈ కార్యక్రమానికి మద్దతుగా డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ఎర్రోళ్ల సంజయ్, నాయకులు ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

