* మహిళలు, బాలల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన సదస్సు
* పెద్దపల్లి షీ టీమ్ ఆధ్వర్యంలో కార్యక్రమం
గోదావరిఖని: రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు పెద్దపల్లి షీ టీమ్ ఆధ్వర్యంలో గోదావరిఖని అశోక్‌నగర్ జెడ్పీహెచ్‌ఎస్ హైస్కూల్ విద్యార్థులకు మహిళలు, బాలల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా షీ టీమ్ ఇన్‌చార్జి ఎస్‌ఐ లావణ్య విద్యార్థులకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్, పోక్సో చట్టం, సోషల్ మీడియా వినియోగం, సైబర్ మోసాలు, మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కల్పించారు.
అపరిచిత వ్యక్తుల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎవరైనా వేధింపులకు గురిచేస్తే భయపడకుండా వెంటనే షీ టీమ్‌కు 6303923700 నంబర్‌కు సమాచారం అందించాలని తెలిపారు.
అత్యవసర పరిస్థితుల్లో 100/112కు, సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930కు ఫిర్యాదు చేయాలని సూచించారు. మహిళలు ప్రయాణ సమయంలో భద్రత కోసం T-Safe యాప్‌ను వినియోగించుకోవాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల హెడ్‌మాస్టర్ మల్లేష్, ఉపాధ్యాయులు, షీ టీమ్ సభ్యులు సురేష్, మౌనిక, స్నేహలత తదితరులు పాల్గొన్నారు.

