* మెరుగైన వైద్యం అందేలా ప్రత్యేక చర్యలు.. కుటుంబానికి భరోసా
రామగుండం: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,గుమ్మడి కుమారస్వామి అనారోగ్యానికి గురై హైదరాబాద్‌లో చికిత్స కోసం వెళ్తున్న విషయం తెలుసుకున్న రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ వెంటనే స్పందించి ఆయన కుటుంబానికి అండగా నిలిచారు.
కుమారస్వామికి హైదరాబాద్‌లో మెరుగైన వైద్యం అందేలా సంబంధిత వైద్యులతో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ స్వయంగా మాట్లాడారు. అవసరమైన వైద్య సహాయం అందేలా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. అనంతరం మనాలి ఠాకూర్ కుమారస్వామితో మాట్లాడి ధైర్యం చెప్పారు. అధైర్యపడవద్దని, త్వరగా కోలుకుంటారని భరోసా కల్పించారు.
కుమారస్వామి అనారోగ్యం నుంచి త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కుటుంబ సభ్యులు భగవంతుడిని ప్రార్థించారు.కుమారస్వామి కుటుంబానికి తమ కుటుంబం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ భరోసా ఇచ్చారు. అవసరమైన సమయంలో కుటుంబానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు.

