* ఘనంగా జాతీయ పతాక ఆవిష్కరణ
పెద్దపల్లి : భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా పెద్దపల్లి పట్టణంలోని జెండా చౌరస్తా వద్ద జాతీయ జెండా ఆవిష్కరణను బిజెపి శ్రేణులు ఘనంగా జరిపాయి. బీజేపీ పట్టణ అధ్యక్షులు పెంజర్ల రాకేష్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో రిటైర్డ్ ఆర్మీ అధికారి మేకల విజయ్ కుమార్ పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం బీజేపీ నాయకులు, కార్యకర్తలు జాతీయ జెండాలను చేతబూని భారత్ మాతాకీ జై, వందేమాతరం నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ప్రతిఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసేలా ప్రజలను ప్రోత్సహించడమే హర్ ఘర్ తిరంగా యాత్ర ప్రధాన ఉద్దేశమన్నారు. దేశభక్తి, జాతీయ సమైక్యతను మరింత బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమం ద్వారా జాతీయ జెండాపై గౌరవం, దేశభక్తి భావనను ప్రతి కుటుంబంలో పెంపొందించాలని నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి శివంగరి సతీష్, తిరంగా యాత్ర కో-కన్వీనర్ కావేటి రాజగోపాల్, బెజ్జంకి దిలీప్, గుడ్ల సతీష్, మహంత కృష్ణ, బొడ్డుపల్లి కుమార్, అఖిల్, మధుకర్, హరీష్, పోగుల రాజు, మంతెన కృష్ణ, మహేష్, శ్రావణ్, రమేష్, శివసాయి, సురేష్ తదితర బీజేపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు వేల్పుల రమేష్, మండల కన్వీనర్ ఇల్లందు అంజి ఆధ్వర్యంలో ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలో భాగంగా రాగినేడు గ్రామంలో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మేకల విజయ్ కుమార్ రిటైర్డ్ ఆర్మీ బిజెపి సీనియర్ పొన్నo మధురయ్య పాల్గొని జెండా ఆవిష్కరణ చేశారు. బిజెపి స్థానిక నాయకులు మరియు కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం గ్రామంలోని ప్రధాన వీధుల గుండా ‘భారత్ మాతాకీ జై’, ‘వందేమాతరం’ నినాదాల మధ్య భారీ ర్యాలీ నిర్వహించారు. ఇంటింటికీ జాతీయ జెండా దేశభక్తిని పెంపొందించే దిశగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేయాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు తంగేడ రాజేశ్వర్ రావు, తాళ్ల లక్ష్మణ్, మండల ప్రధాన కార్యదర్శి మామిడి ఉమేష్, ముంజ రాజేంద్రప్రసాద్, పడాల నరసయ్య, చింతపండు స్వామి, దండు చంద్రయ్య, గుంటుకు సది, మేడగొని శివయ్య, యువ మోర్చా అధ్యక్షులు రెడ్ల వేణు, ముత్యం సాగర్, ముసారి రవి బిజెపి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

