Sunday, July 26, 2026

Buy now

జనుంపల్లి రఘుమారెడ్డికి ముందస్తు సన్మానం

​ప్రజానావ ఉమ్మడి మహబూబ్ నగర్ బ్యూరో: వనపర్తి జిల్లా పరిషత్ ఉన్నత బాలుర పాఠశాలలో నిర్వహించిన తెలుగు భాషా పండితుల శిక్షణా కార్యక్రమం శనివారంతో ముగిసింది. ఈ సందర్భంగా అక్టోబరులో పదవీ విరమణ పొందనున్న తెలుగు పండితుడు జనుంపల్లి రఘుమారెడ్డి సార్‌ను ఉపాధ్యాయులు, అధికారులు ఘనంగా సన్మానించారు. కోర్సు డైరెక్టర్ జీహెచ్‌ఎం శివాజీ, విద్యాశాఖ ఏఎంఓ మహానంది, సీఎంఓ ప్రతాప్‌రెడ్డి చేతుల మీదుగా ఆయనను శాలువా, పూలదండతో సత్కరించారు. ​ఈ సందర్భంగా పండిత సంఘం అధ్యక్షుడు బూరోజు గిరిరాజాచారి మాట్లాడుతూ.. 37 ఏళ్ల పాటు సుదీర్ఘ సేవలు అందించిన రఘుమారెడ్డి సౌమ్యుడు, మృదుస్వభావి, ఆధ్యాత్మిక వేత్త అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో తెలుగు పండితుడు నిరంజనయ్య, ఆర్‌పీలు జయంతిరెడ్డి, రాజారెడ్డి, సుధాకరాచారి, భానుచందర్, నరసింహస్వామి తదితరులు పాల్గొన్నారు.

Related Articles

spot_img

Most Popular