Monday, July 27, 2026

Buy now

జపాన్ ఓపెన్ సూపర్-750 విజేత పీవీ సింధూకు టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత శుభాకాంక్షలు

హైదరాబాద్ :జపాన్ ఓపెన్ సూపర్-750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో అద్భుత ప్రదర్శనతో విజేతగా నిలిచి, ఈ ప్రతిష్ఠాత్మక టైటిల్‌ను గెలిచిన తొలి భారతీయురాలిగా చరిత్ర సృష్టించిన స్టార్ షట్లర్ పీవీ సింధూకు తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత శుభాకాంక్షలు తెలిపారు.

లింక్డ్‌ఇన్ వేదికగా స్పందించిన కవిత.. పీవీ సింధూ విజయాన్ని అభినందిస్తూ, గత రెండేళ్లుగా ఆమె ఎన్నో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్నప్పటికీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా మళ్లీ అగ్రస్థానానికి చేరుకోవడం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.

క్రీడాకారులు విజయాల్లో ఉన్నప్పుడు అభినందించడం కంటే, కష్టకాలంలో వారికి అండగా నిలవడమే నిజమైన క్రీడాస్ఫూర్తి అని కవిత అన్నారు. సింధూ కెరీర్‌పై అనేక సందేహాలు వ్యక్తమైన సమయంలోనూ ఆమె తన లక్ష్యంపై దృష్టి పెట్టి తిరిగి అత్యున్నత స్థాయికి చేరుకోవడం గొప్ప విజయమని కొనియాడారు.

కవిత శుభాకాంక్షలకు స్పందించిన పీవీ సింధూ “థ్యాంక్స్ అక్క” అంటూ కృతజ్ఞతలు తెలిపారు. తాను కష్టాల్లో ఉన్నప్పుడైనా, విజయాలు సాధిస్తున్నప్పుడైనా ధైర్యం చెబుతూ ప్రోత్సహించే వ్యక్తుల్లో కవిత ఒకరని పేర్కొంటూ ఆమె మద్దతుకు ధన్యవాదాలు తెలిపారు.

Related Articles

spot_img

Most Popular