Saturday, August 15, 2026

Buy now

జయశంకర్ జయంతి వేడుకలు.. ఉత్కంఠగా స్కూల్ లీడర్ ఎన్నికలు!

ప్రజానావ ఉమ్మడి మహబూబ్ నగర్ బ్యూరో: స్థానిక శ్రీ వివేకానంద విద్యా నికేతన్ పాఠశాలలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి ఉత్సవాలు, స్కూల్ లీడర్ ఎన్నికలు అత్యంత ఉత్సాహపూరిత వాతావరణంలో జరిగాయి. ​పాఠశాల చైర్మన్ జి. శ్యామ్ సుందరాచారి, కరస్పాండెంట్ జి. ప్రియాంక, ప్రిన్సిపల్ వై. మల్లేష్ ముఖ్య అతిథులుగా హాజరై, జయశంకర్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. విద్యార్థులు ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. ​అనంతరం నిర్వహించిన ప్రజాస్వామ్యబద్ధమైన ఎన్నికల్లో ఐదో తరగతి విద్యార్థిని జి. నక్షత్ర 12 ఓట్ల మెజారిటీతో స్కూల్ ఫస్ట్ లీడర్గా, అదే తరగతికి చెందిన గోవర్ధన్ సెకండ్ లీడర్గా ఎన్నికయ్యారు. విజేతలకు యాజమాన్యం, ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు.

Related Articles

spot_img

Most Popular