Monday, July 27, 2026

Buy now

జర్నలిస్టుల పిల్లలకు రాయితీ విద్యను అందించాలి

* టీయూడబ్ల్యూజే హెచ్ 143 జాతీయ కౌన్సిల్ సభ్యులు అంకరి ప్రకాష్

ప్రజానావ,బ్యూరో,పెద్దపల్లి : పెద్దపల్లి జిల్లాలోని వర్కింగ్ జర్నలిస్టుల పిల్లలందరికీ రాయితీ విద్యను అందించాలని టియుడబ్ల్యూజే హెచ్ 143 నేషనల్ కౌన్సిల్ సభ్యులు, పెద్దపల్లి జిల్లా మీడియా అక్రిడేషన్ కమిటీ మెంబర్ అంకరి ప్రకాష్, టెంజు పెద్దపల్లి జిల్లా ఉపాధ్యక్షుడు రమేష్ లు విజ్ఞప్తి చేశారు. సోమవారం టీయూడబ్ల్యూజే హెచ్- 143 ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లాలో దాదాపు 500 మంది వరకు అక్రిడేటెడ్ జర్నలిస్టులు ఉన్నారని, మరో 200 వరకు నాన్ అక్రిడేటెడ్ జర్నలిస్టులు ఉన్నారని వారి పిల్లలందరికీ రాయితీపై విధ్యను పొందే అవకాశం కల్పించాలని కోరారు. గతంలో జర్నలిస్టుకు ఉన్న ఇద్దరు పిల్లలు ఒకరికి పూర్తి ఉచితంగా మరొకరికి 50 శాతం రాయితీ విద్యను అందించారని, కానీ ఈ ఏడాది జర్నలిస్టుకు ఉన్న ఇద్దరు పిల్లలకు ఉచిత విద్యను అందించే అవకాశాన్ని పరిశీలించాలని వారు కోరారు. జర్నలిస్టుల విజ్ఞప్తిని సావదాణంగా ఆలకించిన జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. జర్నలిస్టుల పిల్లలకు జిల్లాలోని ప్రైవేటు పాఠశాలల్లో రాయితీ విద్యను అందించేందుకు కృషి చేస్తామన్నారు. జిల్లా కలెక్టర్, పెద్దపల్లి జిల్లా మీడియా అక్రిడేషన్ కమిటీ చైర్మన్ కోయ శ్రీహర్ష జర్నలిస్టుల అక్రిడేషన్ తో పాటు, జర్నలిస్టుల సమస్యల పట్ల సానుకూలంగా ఉండడం పట్ల జర్నలిస్టుల తరపున జిల్లా కలెక్టర్ కు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో ఇప్పటికే గత రెండు విడతలుగా 450 మంది జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు అందించారని, ఇంకా మిగిలిన ఉన్న జర్నలిస్టుల పట్ల సైతం కలెక్టర్ సానంబుద్ధితో ఉండటం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. జిల్లాలోని వందకు వందశాతం అర్హత గల జర్నలిస్టులందరికి అక్కడేషన్ కార్లు ఇచ్చుకునే అవకాశం రావడం పట్ల వారు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు తిర్రి తిరుపతి గౌడ్, కత్తెర్ల తిరుపతి యాదవ్, అర్కుట మల్లేష్ యాదవ్, కొయ్యడ తిరుపతి యాదవ్, మేకల సంతోష్, చేగొండ రవి కుమార్ యాదవ్, మాచర్ల వంశీ, తిర్రి సుధాకర్ గౌడ్, సుంకే రాజు, మార్పాక అంజి, తూర్పాటి శ్రీనివాస్ లు పాల్గొన్నారు

Related Articles

spot_img

Most Popular