Friday, August 14, 2026

Buy now

జిల్లా నూతన మహిళా కమిటీ సభ్యుల నియామకం

పెద్దపల్లి: రాష్ట్రీయ హిందూ పరిషత్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు జాపతి రాజేష్ పటేల్ సూచన మేరకు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మండల భూపాల్ పెద్దపల్లి జిల్లా నూతన మహిళా కమిటీ సభ్యులను నియమించారు.

పెద్దపల్లి జిల్లా రాష్ట్రీయ హిందూ పరిషత్ రణచండి (మహిళా విభాగం) అధ్యక్షురాలిగా కన్నం అనూష, ఉపాధ్యక్షురాలిగా కర్రే అర్చన ను నియమించారు.

ఈ సందర్భంగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన రణచండి మహిళా విభాగం అధ్యక్షురాలు కన్నం అనూష, ఉపాధ్యక్షురాలు కర్రే అర్చన మాట్లాడుతూ తమపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన రాష్ట్రీయ హిందూ పరిషత్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మండల భూపాల్‌కు, ఈ బాధ్యతలు రావడానికి సహకరించిన పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు జాపతి రాజేష్ పటేల్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

జిల్లాలో మహిళా విభాగాన్ని మరింత బలోపేతం చేసి, సంస్థ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని వారు పేర్కొన్నారు.

Related Articles

spot_img

Most Popular