Saturday, June 27, 2026

Buy now

జిల్లా పోలీస్ కార్యాలయం తనిఖీ :జిల్లా ఎస్పీ

భూపాలపల్లి :వార్షిక తనిఖీల్లో భాగంగా ఈరోజు భూపాలపల్లి జిల్లా పోలీస్ కార్యాలయం (డీపీఓ)లోని అడ్మినిస్ట్రేటివ్(పరిపాలన విభాగం) కార్యాలయాన్ని జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, ఐపీఎస్ గారు తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా కార్యాలయంలో నిర్వహిస్తున్న పరిపాలనా రికార్డులు, సర్వీస్ రిజిస్టర్లు, ఫైళ్ల నిర్వహణ, అధికారిక పత్రాలు, పెండింగ్ అంశాలు, కార్యాలయ నిర్వహణ తీరును క్షుణ్ణంగా పరిశీలించారు.

రికార్డులను ఎప్పటికప్పుడు నవీకరించి సక్రమంగా నిర్వహించాలని, పెండింగ్ ఫైళ్లను త్వరితగతిన పరిష్కరించాలని, ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా కార్యాలయ నిర్వహణ ఉండాలని సంబంధిత అధికారులకు ఎస్పీ గారు సూచించారు.

Related Articles

spot_img

Most Popular