Wednesday, June 24, 2026

Buy now

జూన్ 24న ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల భర్తీకి వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహణ:జిల్లా ఆసుపత్రి సూపరిండెంట్

పెద్దపల్లి : జూన్ 24న పెద్దపల్లి ఆసుపత్రిలో ఖాళీగా ఉన్న వైద్య పోస్టుల భర్తీకి వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నామని, ఆసక్తి అర్హత గల అభ్యర్థులు హాజరుకావాలని జిల్లా ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ కె. శ్రీధర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

పెద్దపల్లి జిల్లాలో గల తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఆసుపత్రులలో ఖాళీగా ఉన్న 2 సివిల్ అసిస్టెంట్ సర్జన్ ఎం.బి.బి.ఎస్ పోస్టులను కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేసేందుకు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నామని అన్నారు.

ఆసక్తి గల వైద్యులు తమ యొక్క దరఖాస్తు బయోడేటా తో పాటు అన్ని విద్యార్హతల ఒరిజినల్ సర్టిఫికెట్ల తో పాటు జిరాక్స్ ప్రతులు ఒక సెట్ తో హాజరు కావాలని,సివిల్ అసిస్టెంట్ సర్జన్ కి వేతనం రూపాయలు 52,351 ఉంటుందని ,ఇతర వివరాలకు 9492457809, 8499061999 నెంబర్ నందు సంప్రదించాలని జిల్లా ఆసుపత్రి సూపరిండెంట్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

Related Articles

spot_img

Most Popular