Thursday, July 30, 2026

Buy now

జైపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ దాడి

* రూ.21,450 నగదు, 52 పేకముక్కలు, 6 మొబైల్ ఫోన్లు స్వాధీనం.. ఐదుగురు అరెస్టు**

రామగుండం: పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు నేరాల నియంత్రణలో భాగంగా టాస్క్ ఫోర్స్/నార్కోటిక్ బృందం చేపట్టిన ప్రత్యేక తనిఖీల్లో జైపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని టేకుమట్ల గ్రామంలో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై దాడి నిర్వహించారు.నమ్మదగిన సమాచారం మేరకు టేకుమట్ల గ్రామంలో కొందరు వ్యక్తులు నగదును పందెంగా పెట్టుకుని మూడు ముక్కల పేకాట ఆడుతున్నట్లు గుర్తించిన టాస్క్ ఫోర్స్ పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని ఆకస్మికంగా దాడి చేశారు.
ఈ దాడిలో ఐదుగురు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు వారి వద్ద నుంచి రూ.21,450 నగదు, 52 పేకముక్కలు, 6 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పట్టుబడిన నిందితులను, స్వాధీనం చేసుకున్న నగదు మరియు ఇతర వస్తువులను తదుపరి చట్టపరమైన చర్యల కోసం జైపూర్ పోలీస్ స్టేషన్ అధికారులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు.

Related Articles

spot_img

Most Popular