Friday, August 14, 2026

Buy now

జ్యోతిరావు పూలే, సావిత్రీబాయి పూలే విగ్రహాలను ఆవిష్కరించిన సీఎం రేవంత్‌రెడ్డి

# నెక్లెస్‌ రోడ్‌లో ఘనంగా కార్యక్రమం.. మహనీయులకు పుష్పాంజలి

హైదరాబాద్: సామాజిక సంస్కర్తలు, విద్యా ప్రదాతలు మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రీబాయి పూలే దంపతుల విగ్రహాలను ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి ఆవిష్కరించారు. నెక్లెస్‌ రోడ్‌లోని హెచ్‌ఎండీఏ గ్రౌండ్స్‌ ఎదురుగా ఏర్పాటు చేసిన విగ్రహాలను శుక్రవారం సీఎం ఆవిష్కరించి, మహనీయులకు పుష్పాంజలి ఘటించారు.

ఈ సందర్భంగా పూలే దంపతుల సామాజిక సేవలు, విద్యా రంగానికి చేసిన కృషిని పలువురు కొనియాడారు. సమాజంలో సమానత్వం, విద్య, సామాజిక న్యాయం కోసం వారు చేసిన పోరాటం నేటి తరాలకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, పలువురు రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, బీసీ సంఘాల నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Related Articles

spot_img

Most Popular