పెద్దపల్లి : జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వై. పవిత్ర పెద్దపల్లిలోని డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ హాస్పిటల్ సర్వీసెస్ (డి.సి.హెచ్.ఎస్) ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో దంత వైద్య పరీక్ష (డెంటల్ చెకప్) చేయించుకున్నారు. అనంతరం ఆసుపత్రి వైద్య సూపరింటెండెంట్ డాక్టర్ కె. శ్రీధర్ ని కలిసి ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, రోగులకు అందిస్తున్న సౌకర్యాలు, ఆరోగ్య సేవల నాణ్యతపై చర్చించారు. ఈ సందర్భంగా ప్రజలకు మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఆసుపత్రిలో రోగి కేంద్రిత సేవలకు ప్రాధాన్యత ఇవ్వాలని, సేవల నాణ్యతను నిరంతరం మెరుగుపరచాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.

