మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా షమీర్‌పేట్ తహసీల్దార్ తుమ్మకొమ్మ సుచరితపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు.అవినీతి నిరోధక చట్టం కింద ఏసీబీ కేసు నమోదు చేసి సోదాలు నిర్వహించింది.
సుచరిత నివాసంతో పాటు బంధువులు, బినామీల ఇళ్లలో మొత్తం 4 ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు.
సోదాల్లో రూ.5.05 కోట్ల విలువైన ఆస్తులు గుర్తించిన ఏసీబీ.సిద్దిపేట జిల్లా దామరకుంటలో 2 ఎకరాల 17 గజాల వ్యవసాయ భూమి వెలుగులోకి.హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో 3 ఫ్లాట్ల పత్రాలు స్వాధీనం. కీసర, ఖానామెట్ ప్రాంతాల్లో రెండు ప్లాట్లకు సంబంధించిన డాక్యుమెంట్లు స్వాధీనం.ఏఓ ఇంట్లో రూ.12 లక్షల నగదు లభ్యం.
వోక్స్‌వ్యాగన్, హ్యుందాయ్ క్రెటా కార్లతో సహా రెండు కార్లు గుర్తింపు.రూ.1.20 కోట్ల విలువైన బంగారం, వజ్రాల ఆభరణాలు స్వాధీనం.బ్యాంకు ఖాతాల్లో రూ.38 లక్షల నిల్వలు ఉన్నట్లు గుర్తింపు.పత్రాల్లో చూపిన విలువ కంటే మార్కెట్ విలువ మరింత ఎక్కువగా ఉంటుందని ఏసీబీ అంచనా.ఇప్పటికే రూ.30 లక్షల లంచం డిమాండ్ కేసులో సుచరిత అరెస్టు.రూ.2 లక్షల పాక్షిక లంచం స్వీకరిస్తుండగా ఏసీబీ వలలో చిక్కిన సుచరిత. ప్రస్తుతం సుచరిత జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నట్లు ఏసీబీ వెల్లడించింది. ప్రభుత్వ అధికారులు లంచం డిమాండ్ చేస్తే 1064 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని ఏసీబీ సూచన.

