Monday, July 27, 2026

Buy now

తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షులుగా మారిపల్లి మాధవి

హైదరాబాద్,జూలై 27: తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవం కోసం రెండు దశాబ్దాలుగా కృషి చేస్తున్న తెలంగాణ జాగృతి సంస్థకు రాష్ట్ర అధ్యక్షురాలిగా మారిపెల్లి మాధవిని నియమించారు. ఈ మేరకు తెలంగాణ జాగృతి ఫౌండర్ చైర్‌పర్సన్ కల్వకుంట్ల కవిత సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.

2006లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలో తెలంగాణ సంస్కృతి, చారిత్రక వారసత్వాన్ని పరిరక్షించి ప్రపంచానికి పరిచయం చేయాలనే లక్ష్యంతో కల్వకుంట్ల కవిత తెలంగాణ జాగృతిని స్థాపించారు. తెలంగాణ పల్లెలకే పరిమితమైన బతుకమ్మ పండుగను ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందేలా చేయడంలో సంస్థ కీలక పాత్ర పోషించింది. అలాగే బతుకమ్మ వేడుకల ద్వారా మహిళలను పెద్దఎత్తున తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములను చేసింది.

రెండు దశాబ్దాలుగా తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలిగా కొనసాగుతున్న కల్వకుంట్ల కవిత ఇకపై ఫౌండర్ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు నిర్వహిస్తారని, రాష్ట్ర అధ్యక్షురాలిగా మారిపెల్లి మాధవి నియామకం వెంటనే అమల్లోకి వస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Related Articles

spot_img

Most Popular