సిరిసిల్ల: తెలంగాణ రక్షణ సేన సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జిగా ఎండీ మజీద్‌ను నియమిస్తూ ఆ సంస్థ రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ సందర్భంగా తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర అధ్యక్షురాలు కవితకు ఎండీ మజీద్ కృతజ్ఞతలు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ, పార్టీ నాయకులు, కార్యకర్తల సహకారంతో సిరిసిల్ల నియోజకవర్గంలో తెలంగాణ రక్షణ సేనను మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని అన్నారు.
సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జిగా బాధ్యతలు స్వీకరించిన ఎండీ మజీద్‌కు తెలంగాణ రక్షణ సేన నాయకులు కదిరె భాస్కర్ గౌడ్, వరద సతీష్, యువ నాయకుడు జావీద్ తదితరులు అభినందనలు తెలిపారు.

