Thursday, July 16, 2026

Buy now

తెలంగాణ స్థానికత – సవాళ్లు పై రౌండ్ టేబుల్ సమావేశం

సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో తెలంగాణ రక్షణ సేన అధ్యర్యంలో తెలంగాణ స్థానికత – సవాళ్లు అంశంపై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత

🔹స్థానికత విషయంలో 600 ఏళ్లుగా మన మీద దాడి జరుగుతోంది అన్నారు
🔹స్థానికతపై హైకోర్టు తీర్పును రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలి లేదంటే నిరుద్యోగులతో కలిసి మేమే పిటిషన్ వేస్తాం అన్నారు
🔹ప్రెసిడెన్షియల్ ఆర్డర్ స్పిరిట్ ను న్యాయమూర్తులు అర్థం చేసుకోవాలి అన్నారు
🔹గ్రూప్- 1 నియామాకాల్లో తెలంగాణ అభ్యర్థులకు అన్యాయం చేశారు అన్నారు
🔹మేము అధికారంలోకి వచ్చాక జ్యూడిషియల్ రివ్యూ కమిటీ వేస్తాం అన్నారు

ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ..
🔹ప్రెసిడెన్షియల్ ఆర్డర్ లో ఉన్న మూడు అంశాలను కలిపి చూడాలంటూ స్థానికత అంశంపై తీర్పు ఇచ్చిన జడ్జి అంటున్నారు.
🔹దాని కారణంగా మనకు తీవ్రమైన నష్టం జరుగుతుంది అన్నారు.
🔹ఈ స్థానికత అంశం మీద మనపై 6 వందల ఏళ్లుగా దాడి జరుగుతూనే ఉంది అన్నారు.
🔹బహుమనీ రాజ్యంలో ఈ స్థానికత అంశంపై జరిగిన పోరాటం కారణంగా ఆ సామ్రాజ్యమే ఐదు సామ్రాజ్యాలుగా విడిపోతుంది అన్నారు.
🔹అందులో ఒకటే మన గొల్కొండ. వాళ్లు సమస్యను అర్థం చేసుకొని స్థానికులను కలుపుకొని పాలన చేశారు అన్నారు.
🔹ఆ తర్వాత అసఫ్ జహీలు వస్తారు. వాళ్లు వచ్చాక పర్షియన్ బాష పోయి ఉర్ధూ వస్తుంది అన్నారు.
🔹అప్పటికే నార్త్ లో ఉర్ధూ ను పాఠ్యాంశంగా బోధిస్తుండటంతో ఉర్ధూ వచ్చిన నార్త్ వాళ్లు ఇక్కడ ఉద్యోగాల్లో చేరటం మొదలైంది అన్నారు.
🔹దీంతో స్థానికుల హక్కులను కాపాడేందుకు అసఫ్ జహీలు 1868 లో రూల్స్ పెట్టారు అన్నారు.
🔹కానీ 1919 వరకు కూడా అవి సరిగా అమలు కాలేదు. దాంతో 1919 లో ముల్కీ నిబంధనలు తీసుకొచ్చారున్నారు.
🔹వాటిలో 15 ఏళ్లు స్థానికంగా ఉండి మళ్లీ మా ప్రాంతానికి తిరిగి వెళ్లామని అఫిడవిట్ ఇచ్చిన వారినే స్థానికులుగా గుర్తించారు అన్నారు.
🔹కానీ 1935 వరకు కూడా అవి అమలు కాలేదు. ఆ తర్వాత ఇడ్లీ సాంబర్ గో బ్యాక్ మూమెంట్ వచ్చింది అన్నారు.
🔹1956 లో మనం ఆంధ్రప్రదేశ్ లో విలీనం అయినప్పుడు 15 ఏళ్ల నిబంధనను 12 ఏళ్లకు కుదించారు అన్నారు.
🔹అప్పటి నుంచి మనకు బాషలో యాసలో ఉద్యోగాల్లో అన్యాయం చేస్తూనే ఉన్నారు.
🔹1969 ఉద్యమం కారణంగా ఆరు సూత్రాలు తీసుకొచ్చి ఇంకా 12 ఏళ్లను కాస్త 4 ఏళ్లకు కుదించారు.
🔹ఆరుసూత్రాల అమలు తీసుకొచ్చిన తర్వాత స్థానికులకు మరింత అన్యాయం జరిగింది.
🔹ఎన్టీఆర్ వచ్చాక జై భారత్ కమిషన్ వేసి 50 వేలకు పైగా ఉద్యోగాలు స్థానికేతరులకు వచ్చాయని నిర్ణయించారు.
🔹610 జీవో ద్వారా అన్యాయాన్ని సరిచేస్తామన్నారు. కానీ అది కూడా జరగలేదు.
🔹ఇక తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించుకుంటేనే న్యాయం జరుగుతుందని భావించి 2014 లో తెలంగాణ తెచ్చుకున్నాం.
🔹ఈ 12 ఏండ్లలో కూడా మనకు అన్యాయమే జరిగింది. రాష్ట్రపతి ఉత్వర్వులు వచ్చే వరకు జరిగిన నియామకాల్లో కూడా నష్టం జరిగింది.
🔹అసలు రాష్ట్రపతి ఉత్తర్వుల్లోనే స్పష్టత కొరవడింది. 95 శాతం స్థానికులకు అంటే 5 శాతం స్థానికేతరులకు అని కాదు.
🔹మెరిట్ ఉన్న స్థానికులకు కూడా అందులో అవకాశం కల్పించాలి.
🔹కానీ వాటిని నాన్ లోకల్ వాళ్లతో నింపాలనే ప్రయత్నం చేస్తున్నారు.
🔹దీనికి మొన్నటి గ్రూప్ -1 నియామకాలు సరైన ఉదాహరణ. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం ఇద్దరికీ అవకాశం ఇవ్వాల్సి ఉంటే 11 మందికి ఇచ్చారు.
🔹బయట రాష్ట్రం వాళ్లకు ఈడబ్ల్యూఎస్, బీసీ డీ సర్టిఫికెట్లు ఇచ్చి వారికి ఉద్యోగాలు వచ్చేలా చేశారు.
🔹మొత్తంగా చూస్తే 563 ఉద్యోగాల్లో 2 వందల మంది ఇతర రాష్ట్రాల వాళ్లు ఉంటారు.
🔹మన పరిరక్షణకు రాజ్యాంగం ఇచ్చిన హక్కును కాలరాస్తున్నారు.
🔹మహారాష్ట్ర ఎస్టీ బిల్ అనే వాళ్లు ఉంటారు. వాళ్లు స్టేట్ ఉద్యోగాలకైతే ఓసీలు అవుతారు. అదే సెంట్రల్ ఉద్యోగాలకు ఎస్టీ లుగానే పరిగణిస్తారు.
🔹కానీ మన గ్రూప్ వన్ లో ఈడ్ల్యూఎస్ వాళ్లకు బీసీ డీ సర్టిఫికెట్లు ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చారు.
🔹ఇద్దరికీ ఇవ్వాల్సిన ఉద్యోగాలకు 9 మందికి అదనంగా ఇచ్చారు.
🔹పైగా వీటిని నిరుద్యోగులు సవాల్ చేయకుండా పెద్ద పెద్ద లాయర్లకు డబ్బులు ఇచ్చి కేసులను ప్రభుత్వం వాదింపజేస్తోంది.
🔹కొన్ని కేసులను బెంచ్ మీదకు కూడా రానివ్వటం లేదు.
🔹గత 6 వందల ఏళ్లుగా మనం ఈ దుఖం అనుభవిస్తూనే ఉన్నాం.
🔹ఇతర రాష్ట్రాల్లో మన తెలంగాణ వాళ్లు నాలుగేళ్లు చదివితే వాళ్లను అక్కడ లోకల్ గా పరిగణిస్తారా?
🔹రాష్ట్రపతి ఉత్తర్వుల్లో ఉన్న స్పిరిట్ ను జడ్జి గారు అర్థం చేసుకోవాలి.
🔹ఇక్కడ ప్రజల త్యాగాలు, దుఖం, ఆవేదనను అర్థం చేసుకోవాలి.
🔹ప్రెసిడెన్షియల్ ఆర్డర్ నంబర్ 7 ప్రకారం అందరికీ న్యాయం చేయవచ్చు.
🔹వాటిలో ఉన్న మూడు రూల్స్ ను కలిపి చూస్తామంటే కుదరదు. రాజ్యాంగ ఇచ్చిన రక్షణను కాపాడాల్సిందే.
🔹ఇప్పుడున్న పరిస్థితి చూస్తుంటే మళ్లీ ముల్కీ రూల్స్ రావాల్సిందే అని అనిపిస్తోంది.
🔹ఇతర ప్రాంతాల వాళ్లు మన దగ్గర లోకల్ గా చేరి ఉద్యోగాలు తెచ్చుకుంటే 30 ఏళ్లు మన వనరులపై వాళ్లకు అధికారం వస్తుంది.
🔹ఇక్కడ పనిచేసే ఆఫీసర్లకు ఈ నేల బాధలు తెలవాలి. వేరే వాళ్లకు ఉద్యోగాలు ఇస్తామంటే కష్టం.
🔹రేవంత్ రెడ్డి గ్రూప్ -1 లో ఇచ్చిన ఉద్యోగాలను మేము అధికారంలోకి రాగానే రివ్యూ చేస్తాం అన్నారు
🔹జ్యూడిషియల్ కమిటీ వేసి వాటిలో మార్పులు చేసి తీరుతాం అన్నారు.
🔹తెలంగాణ తలరాతను మార్చే గ్రూప్ -1 ఉద్యోగాల్లో మన వారికి చేసిన అన్యాయాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించం అన్నారు.
🔹నీళ్ల విషయంలో కర్ణాటక మనకు అన్యాయం చేస్తుంటే అక్కడకు వెళ్లి మంగళహారతి పడుతున్నాడు అన్నారు.
🔹ఆయన చేస్తున్న పని కారణంగా నీటి వాటాలో మన హక్కు కోల్పోతాం అన్నారు.
🔹మేము నిరుద్యోగులు, ఉద్యమకారులు, తెలంగాణ ప్రజల పక్షాన పోరాటం చేస్తూనే ఉంటాం అన్నారు.
🔹జులై 2 న ఉప్పల్ భగాయత్ లో మరో మిలియన్ మార్చ్ జరగబోతోంది అన్నారు.
🔹ఈ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలుపుకోవాలంటే మరో తెలంగాణ ఉద్యమం చేయాల్సిందే అన్నారు.
🔹స్థానికత విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టులో ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేయాలి. గట్టి లాయర్ ను పెట్టాలి అన్నారు.
🔹15 రోజులు వేచి చూస్తాం. ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేయకపోతే నిరుద్యోగులతో కలిసి మేము రివ్యూ పిటిషన్ వేస్తాం అన్నారు.
🔹ఈ తీర్పును అడ్డుకోకపోతే మనకు మనమే అన్యాయం చేసుకునేందుకు ప్లడ్ గేట్లు ఎత్తినట్లే అవుతుంది అన్నారు.
🔹ప్రభుత్వ ఉద్యోగాలు రాకపోయినా ప్రైవేట్ లోనై ఉద్యోగాలు వస్తున్నాయా అంటే అది లేదు అన్నారు.
🔹ప్రైవేట్ సంస్థలతో కుదుర్చుకున్న ఒప్పందాలతో ఒక్క ఉద్యోగం వచ్చింది లేదు అన్నారు.
🔹గతంలో ఎప్పుడు లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం పై ఎస్బీఐ బ్యాంక్ కేసు వేసింది అన్నారు.
🔹బ్యాంక్ కు ఇచ్చిన భూమిని ప్రభుత్వమే అమ్ముకుంటే మన వద్దకు పెట్టుబడులు ఎలా వస్తాయి

Related Articles

spot_img

Most Popular