ప్రజానావ,ఉమ్మడి మహబూబ్ నగర్ బ్యూరో: తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమాల్లో ప్రాణాలు, భవిష్యత్తును పణంగా పెట్టి పోరాడిన నిజమైన ఉద్యమకారులకు సముచిత గుర్తింపు ఇవ్వాలని తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ, వనపర్తి జిల్లా టీజేఎస్ అధ్యక్షుడు మా. ఖాదర్ పాషా డిమాండ్ చేశారు. ఈ మేరకు తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ ఛైర్మన్‌కు వినతిపత్రంలో వనపర్తి జిల్లాకు చెందిన ఉద్యమకారుల జాబితాను సమర్పించారు. గత ప్రభుత్వంలో తగిన గుర్తింపు, ప్రోత్సాహం లభించక అనేకమంది నిరుద్యోగంతో, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారని పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ప్రత్యేక కమిటీ వేసి నిజమైన ఉద్యమకారులను గుర్తించే చర్యలు చేపట్టడాన్ని స్వాగతిస్తున్నామని తెలి పారు. రాజకీయాలకు అతీతంగా, నిష్పాక్షికంగా సేకరించిన ప్రతి అర్హులైన ఉద్యమకారుడికి న్యాయం చేయాలని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో టీజేఏసీ కన్వీనర్ డాక్టర్ టి. గాంధీ, అక్కిల బాబుగౌడ్ తదితరులు పాల్గొన్నారు.

