ఉమ్మడి మహబూబ్ నగర్ బ్యూరో: వట్టెం జవహర్ నవోదయ విద్యాలయంలో 2027–28 విద్యా సంవత్సరానికి గానూ 6వ తరగతి ప్రవేశాల కోసం అర్హులైన విద్యార్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఒక ప్రకటనలో తెలిపారు.
ప్రస్తుతం ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని పేర్కొన్నారు. చివరి తేదీ: జూలై 31, 2026 https://navodaya.gov.in లేదా http://cbseitms.rcil.gov.in/nvs/ పరీక్ష తేదీ: నవంబర్ 28, 2026 వరకు, జిల్లాలోని అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు, తల్లిదండ్రులు విస్తృత ప్రచారం కల్పించాలని కలెక్టర్ సూచించారు.

