బంజారా సమాజానికి నాటి ప్రధాని ఇందిరా గాంధీ గారు రిజర్వేషన్ కల్పించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆదివాసీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో చేపట్టిన బస్సు యాత్రను గాంధీ భవన్‌లో టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ జెండా ఊపి ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో ఏఐసీసీ ఎస్టీ సెల్ జాతీయ చైర్మన్ డా. విక్రాంత్ భూరియా ,మంత్రులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ , జూపల్లి కృష్ణారావు , ఎంపీలు వేం నరేందర్ రెడ్డి , బలరాం నాయక్ , రాష్ట్ర ఆదివాసీ కాంగ్రెస్ చైర్మన్, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ , ప్రభుత్వ విప్ రాంచంద్రు నాయక్ , ఎమ్మెల్యేలు బాలు నాయక్ , రాందాస్ నాయక్ , మురళీ నాయక్ , ట్రై కార్ చైర్మన్ బెల్లయ్య నాయక్ , మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ , రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శివ చరణ్ రెడ్డి , తదితర ఆదివాసీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

