Saturday, August 15, 2026

Buy now

నిరసనకారులపై లాఠీచార్జి దుర్మార్గం: సిపిఐ ఎంఎల్ మాస్ లైన్

ఉమ్మడి మహబూబ్ నగర్ బ్యూరో: ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా నిరసన తెలుపుతున్న పర్యావరణ ఉద్యమకారుడు సోనం వాంగ్ చుగ్, ఇతర నిరసనకారులపై పోలీసులు లాఠీచార్జి చేయడాన్ని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ జిల్లా కమిటీ తీవ్రంగా ఖండించింది. సోమవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని రాజీవ్ చౌక్ వద్ద పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ​ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి సి. హనుమంతు మాట్లాడుతూ.. లడక్ పర్యావరణ పరిరక్షణ కోసం, నిరుద్యోగ సమస్యల పరిష్కారం కోసం ప్రశ్నిస్తున్న వారిపై కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం నిర్బంధాన్ని ప్రయోగిస్తోందని మండిపడ్డారు. పేపర్ లీకేజీల బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా జరిగే ఆందోళనలను అణచివేయడం దుర్మార్గమన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ప్రసాద్, గణేష్, రాజన్న, గీతాబాయి, పిడిఎస్‌యు జిల్లా అధ్యక్షుడు దినేష్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

spot_img

Most Popular