తెలంగాణ : తాను గుంపు మేస్త్రీనేనని, దొరను కాదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తనను చాలామంది అవహేళన చేసినా తాను పట్టించుకోనని, ఈ మంత్రులు, ప్రజలే తన బలం అని అన్నారు. కొంతమంది గొప్పలు చెప్పుకుంటూ తాము దొరలమని చెప్పుకునే పోకడలు తన వద్ద లేవని, తాను కార్మికులకు, కర్షకులకు మేస్త్రీనేనని, తనకు గడీలు లేవని తెలిపారు.

