* సుల్తానాబాద్‌లో SNR స్పోర్ట్స్ అకాడమీ, ఆగో మోర్ ఫ్రెష్ సూపర్ మార్కెట్ ప్రారంభం
సుల్తానాబాద్: సుల్తానాబాద్ పట్టణ కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన SNR స్పోర్ట్స్ అకాడమీ, ఆగో మోర్ ఫ్రెష్ సూపర్ మార్కెట్లను స్థానిక నాయకులతో కలిసి రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు ప్రారంభించారు.
అదేవిధంగా ఎలిగేడు మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన మెడ్‌ప్లస్ ఫార్మసీని కూడా ఆయన స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయా సంస్థల నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు నాణ్యమైన సేవలు అందిస్తూ అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.
ఎమ్మెల్యేకు రాఖీలు కట్టిన ఎలిగేడు ఆడబిడ్డలు
రాఖీ పండుగను పురస్కరించుకుని ఎలిగేడు మండలానికి చెందిన ఆడబిడ్డలు ముందస్తుగా ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయరమణ రావుకు రాఖీలు కట్టారు. ఈ సందర్భంగా ఆయన వారికి రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

