పెద్దపల్లి: రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ బుధవారం పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షను జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా రామగుండం నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. ముఖ్యంగా పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ (రోడ్లు & భవనాలు), రోడ్డు కార్పొరేషన్ పరిధిలో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులు, రహదారుల మెరుగుదల, మౌలిక వసతుల కల్పన తదితర అంశాలపై సమీక్ష నిర్వహించి, పనులను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని అధికారులను కోరారు.
ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందించడమే లక్ష్యంగా అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయాలని ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ అధికారులతో చర్చించారు.

