Friday, August 14, 2026

Buy now

పెద్దపల్లి యువతకు నైపుణ్య శిక్షణ, ఉపాధి అవకాశాలు పెంచాలి

* PM-SETU ITI క్లస్టర్ ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి
* సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి హెచ్.డి. కుమారస్వామి

న్యూఢిల్లీ: పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ యువతకు మరిన్ని నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణతో కలిసి కేంద్ర భారీ పరిశ్రమల మంత్రి హెచ్.డి. కుమారస్వామిని కలిసి PM-SETU ITI క్లస్టర్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.

పారిశ్రామిక, మైనింగ్ బెల్ట్‌గా ఉన్న పెద్దపల్లి ప్రాంత అవసరాలకు అనుగుణంగా యువతకు ఆధునిక సాంకేతిక శిక్షణ అందించేందుకు మైనింగ్, మెటల్స్, ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్, మెకానికల్ రంగాలను ప్రధానంగా తీసుకుని ఈ క్లస్టర్‌ను ఏర్పాటు చేయాలని కోరారు.

ప్రభుత్వ ITIని హబ్‌గా..

ఒక ప్రభుత్వ ITIని PM-SETU హబ్‌గా, నియోజకవర్గంలోని ఇతర ITIలను స్పోక్‌లుగా అనుసంధానించాలని ప్రతిపాదించారు. తద్వారా స్థానిక యువతకు పరిశ్రమలతో ప్రత్యక్ష అనుసంధానం, ఇండస్ట్రీ ఎక్స్‌పోజర్, అప్రెంటిస్‌షిప్, ఆన్‌ది‌జాబ్‌ ట్రైనింగ్‌తో పాటు ప్లేస్‌మెంట్ అవకాశాలు కల్పించవచ్చని వివరించారు.

పెద్దపల్లి ప్రాంతంలో పారిశ్రామిక, మైనింగ్ రంగాల అవసరాలకు అనుగుణంగా నైపుణ్య శిక్షణ అందించడం ద్వారా స్థానిక యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించవచ్చని కేంద్ర మంత్రికి వివరించారు.ఈ విజ్ఞప్తిపై కేంద్ర భారీ పరిశ్రమల మంత్రి హెచ్.డి. కుమారస్వామి సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.

Related Articles

spot_img

Most Popular