పాలకుర్తి,:పెద్దవంగర మండల నూతన మండల అభివృద్ధి అధికారి (ఎంపీడీవో)గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన సురేష్ శుక్రవారం పాలకుర్తి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా పెద్దవంగర మండల అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై ఇరువురు సంక్షిప్తంగా చర్చించారు. మండలంలో అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయడం, ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు సమర్థవంతంగా చేరేలా చర్యలు చేపట్టడం వంటి అంశాలు చర్చకు వచ్చినట్లు తెలిసింది.
నూతన బాధ్యతలు స్వీకరించిన ఎంపీడీవో సురేష్‌కు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రజలకు జవాబుదారీతనంతో, పారదర్శకంగా సేవలందించాలని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తూ మండల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు.ఈ మర్యాదపూర్వక భేటీ సానుకూల వాతావరణంలో జరిగింది.

